గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (18:09 IST)

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

seema hyder
కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పైగా, వివిధ కారణాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పౌరులంతా 48 గంటల్లో తమ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అలాగే, భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ దౌత్య సిబ్బంది కూడా మే నెల ఒకటో తేదీలోపు దేశాన్ని వీడాలని కోరింది. 
 
ఈ నేపథ్యంలో తన ప్రియుడు కోసం భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ పేరు ఇపుడు మరోమారు తెరపైకి వచ్చింది. అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి గత రెండేళ్లుగా ఉంటోంది. పైగా ఆమె ఇటీవలే ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇపుడు కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని కోరడంతో సీమా హైదర్ కూడా వెళ్లిపోవాల్సిందేనా అనే చర్చ వైరల్ అవుతోంది. 
 
సీమా హైదర్ 32 యేళ్ళ పాకిస్థాన్ మహిళ. పాక్‌‍లోని సింధ్ రాష్ట్రం జకోబాబాద్‌‍ నివాసి.  ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. తన పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా ఆమె భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో సచిన్ మీణాతో కలిసి ఉంటుంది. అప్పటి నుంచి ఆమె తనకు భారత  పౌరసత్వం కల్పించాలని కోరుతుండగా, కేంద్ర మాత్రం స్పదించలేదు.