యుద్ధం దిశగా భారత్ - పాకిస్థాన్ అడుగులు : వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ
భారత్, పాకిస్థాన్ దేశాలు యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయనీ వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయనీ ఆ
భారత్, పాకిస్థాన్ దేశాలు యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయనీ వేర్పాటువాద నేత షౌకత్ అలీ కశ్మీరీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయనీ ఆయన చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఘర్షణలపై ఆయన స్పందిస్తూ... యూరీలో ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
గత 30 ఏళ్లుగా ఉగ్రదాడులతో కాశ్మీర్‌లోయలో ఉద్రిక్తతలను పెంచుతోందంటూ ఆయన పాకిస్థాన్‌పై మండిపడ్డారు. 'భారత-పాక్ యుద్ధం అంచుల్లో ఉన్నాయని నాకు ఆందోళనగా ఉంది. సరిహద్దులకు ఆవలి నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగితే, సైనికులపై దాడులు జరిగితే.. దానికి ప్రతిచర్య తప్పదు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.