బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2016 (16:33 IST)

ఇండియాలో పిచ్చపిచ్చగా పాకిస్తాన్ 'స్పై'లు...?

భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను పాకిస్తాన్ స్పైలు చౌర్యం చేసి వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేస్తున్న వైనం బయటపడింది. ముఖ్యంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు కాజేస్తూ ఆ వివరాలను చక్కగా పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్నట్లు త

భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక పత్రాలను పాకిస్తాన్ స్పైలు చౌర్యం చేసి వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేస్తున్న వైనం బయటపడింది. ముఖ్యంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు కాజేస్తూ ఆ వివరాలను చక్కగా పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్నట్లు తేలింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దేశంలో మరికొందరు ఇలాగే చొరబడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
భారత్‌లో పని చేస్తున్న పాకిస్థాన్ అధికారులు కూడా తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమినర్ కార్యాలయంలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతని ఇంట సోదాలు జరిపి అరెస్ట్ చేశారు. 
 
సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గరి నుంచి పట్టుబడటం గమనార్హం. ఈ అధికారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, విషయాన్ని పాక్ అధికారులకు తెలిపామని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరి దీనిపై పాకిస్తాన్ ఏమంటుందో...?