1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:18 IST)

పన్నీర్ ప్రధాన అస్త్రం అదే... మ్యాజిక్ ఫిగర్ 117... సెల్వం పక్షాన 15 మంది... ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అసెంబ్లీలో బల నిరూపణ చేసేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కేవలం ఐదుగురు

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అసెంబ్లీలో బల నిరూపణ చేసేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గవర్నర్‌ను కలిసిన ఆయన... బల నిరూపణకు సై అనడమే ఇపుడు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. వచ్చే వారంలో వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పే. జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసులో త్వరలోనే తీర్పును వెల్లడిస్తామంటూ కోర్టు వెల్లడించింది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళకు ప్రతికూలంగా తీర్పు వెలువడితే, పన్నీరు పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడినట్టే! అదే కోర్టు తీర్పు ఒకవేళ శశికళకు అనుకూలంగా వస్తే, బల నిరూపణకు ఆమె సిద్ధపడితే ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది.
 
ఇటువంటి పరిస్థితి వస్తే, పన్నీరుకు డీఎంకే లోపాయికారీ సహకారం అందించవచ్చనే ప్రచారం జరుగుతోంది. 234 మంది ఎమ్మెల్యేలున్న తమిళ అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీతో కలిసి సాగుతున్న కాంగ్రెస్‌కు‌ 8 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే, డీఎంకే కూటమికి 97 మంది ఎమ్మెల్యేలున్నారు. 
 
జయలలిత మరణంతో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ దాటాలంటే 117 మంది ఎమ్మెల్యేలు అవసరం. డీఎంకే సాయంతో గట్టెక్కాలనుకుంటే పన్నీర్‌ సెల్వంకు సొంతంగా మరో 20 మంది ఎమ్మెల్యేల అవసరముంది. మధుసూదన్‌ కూడా తిరిగి రావడంతో ఎమ్మెల్యేల సంఖ్య 15కు పెరిగిందని, మరో ఆరుగురిని ఆకర్షించడం పెద్ద కష్టం కాబోదని ఆయన అనుయాయులు చెబుతున్నారు.