శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (12:27 IST)

పఠాన్ కోట్ దాడి: 101 పేజీల ఛార్జీషీట్ విడుదల.. అజర్‌తో రవూఫ్‌లే నిందుతులు

భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అ

భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్రపన్నింది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజరేనని 101 పేజీల చార్జిషీటులో పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న  పనిచేస్తున్న జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రవూఫ్ ఆస్ఘర్‌లను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. పఠాన్‌కోట్ దాడి అనంతరం... ఈ దాడికి బాధ్యత తమదేనని పేర్కొంటూ రవూఫ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. 
 
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో జరిగిన పఠాన్‌కోట్ దాడిలో తన సోదరుడు మసూద్ పాత్రకూడా ఉన్నట్టు రవూఫ్ అందులో వ్యాఖ్యానించాడు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 12 నెలలకు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుతో పాటు ఈ వీడియో సందేశాన్ని కూడా ఎన్ఐఏ తన చార్జిషీట్‌కి జోడించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు తీవ్రవాదులకు సంబంధించిన పలు ఆధారాలను కూడా నమోదు చేసింది.