శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (15:44 IST)

నోట్ల కష్టాలు తీర్చలేకపోతే... యూపీలో డిపాజిట్లు గల్లంతే : బీజేపీ నేతలు

నోట్ల కష్టాలను త్వరితగతిన తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ తీస

నోట్ల కష్టాలను త్వరితగతిన తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం తగ్గుతుందా? అంటూ విమర్శిస్తున్నారు. నగదు సరఫరా ఎప్పటికి చక్కబడుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు గురించి ప్రచారం చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లవుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అగ్ర నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. నోట్ల కష్టాలు తీరకపోతే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టం చేశారట. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోగతం... యూపీ బీజేపీ నేతల ఆందోళన... ఏదీ నిజమో తెలియాలంటే ఎన్నికలయ్యే వరకూ ఆగాల్సిందే.