సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (11:13 IST)

మంగళయాన్ వ్యోమనౌకకు అరుదైన గౌరవం.. నేషనల్‌ జియోగ్రఫిక్‌ ముఖపత్రంపై స్థానం!

మంగళయాన్ వ్యోమనౌకకు మరో గౌరవం దక్కింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లపై స్థానాన్ని సంపాదించుకున్న కొద్దిరోజులకే మంగళయాన్‌ వ్యోమనౌకకు మరో గౌరవం దక్కింది. అంగారకుడికి సంబంధించి ఈ ఉపగ్రహం తీసిన ఫొట

మంగళయాన్ వ్యోమనౌకకు మరో గౌరవం దక్కింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లపై స్థానాన్ని సంపాదించుకున్న కొద్దిరోజులకే మంగళయాన్‌ వ్యోమనౌకకు మరో గౌరవం దక్కింది. అంగారకుడికి సంబంధించి ఈ ఉపగ్రహం తీసిన ఫొటోకు ప్రముఖ మేగజైన్‌ ''నేషనల్‌ జియోగ్రఫిక్‌'' ముఖపత్రంపై స్థానం దక్కింది. తాజాగా మంగళయాన్ అంతర్జాతీయ ప్రాముఖ్యతకు పట్టం కట్టినట్లయింది.
 
భారత్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ఉపగ్రహంలోని ఒక చౌకైన కెమెరా ఈ ఫొటోను తీయడం విశేషం. అంగారకుడి పూర్తి వలయాన్ని ఆవిష్కరించే ఇలాంటి ఫొటోలు డజను కన్నా తక్కువగానే ఉన్నాయి. వీటిలో మంగళయాన్‌ తీసిన చిత్రాలు అత్యుత్తమమైనవని నిపుణులు అంగీకరిస్తున్నారు. 
 
అంతరిక్ష పరిశోదన రంగంలో భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన మంగళ్ యాన్ శాటిలైట్.. మంగళ్‌యాన్‌ అంగారక కక్ష్యలోకి చేరి ఈ వారానికి మూడేళ్లు పూర్తవుతోంది. మంగళ్‌యాన్‌లో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన కెమెరా కొన్ని అరుణగ్రహ చిత్రాలను తీసింది.
 
అంగారకుడు గుండ్రగా నిండుగా కనిపించే ఒక అరుదైన చిత్రాన్ని అత్యంత నాణ్యతతో కూడిన చిత్రాలు ముద్రించే నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మాసపత్రిక కవర్‌పై ముద్రించారు. పున్నమి చంద్రుడిలా అరుణగ్రహాన్ని గుండ్రంగా తీసిన చిత్రాలు డజను కన్నా తక్కువే ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో మన మంగళ్‌యాన్‌ తీసినవే అద్భుతంగా ఉన్నాయి. దీని కన్నా ముందే చేపట్టిన 50 ప్రయోగాల్లో ఒక్కటి సైతం నాణ్యతతో కూడిన చిత్రాలు తీయలేదట.