శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:45 IST)

కారు ప్రమాదంలో చిక్కిన ప్రధాని సతీమణి: ఒకరు మృతి.. ఎవరు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని చిత్తూరుకు సమీపంలో యశోదాబెన్ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో జశోదాబెన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని చిత్తూరుకు సమీపంలో యశోదాబెన్ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో జశోదాబెన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. యశోదాబెన్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని.. ఆమెకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 
 
ఈ ప్రమాదం కోట-చిత్తూర్ హైవేలో చిట్టోర్‌ఘర్‌కు 55 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. అయితే ఏడుగురు ఇనోవా కారులో వెళ్తుండగా, ట్రక్ ఢీకొనడంతో యశోదాబెన్ బంధువైన బసంత్ భాయ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు.

డ్రైవర్‌తో పాటు మిగిలిన వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోదాబెన్ కుటుంబీకులు అట్రు నుంచి గుజరాత్‌కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.