శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:13 IST)

తొందరెందుకు... ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నాం కదా : నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 
 
ఇటీవల పార్లమెంట్‌లో దాఖలు చేసిన వార్షిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ అధికార టీడీపీతో పాటు ఏపీ ప్రజలు అక్రోషిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
 
అదేసమయంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి కూడా ప్రధాని మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పాటు ప్రజల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఏపీకి ఇచ్చిన అన్ని వాగ్ధానాల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని అందువల్ల అన్ని విషయాలపై చర్చించుకుని పరిష్కరించుకుందామన్నారు. ఈ విషయాన్ని తన మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పాలనీ, అవసరమైతే తానే బాబుతో మాట్లాడుతానని మంత్రి సుజనా చౌదరితో చెప్పారు.