సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (11:55 IST)

మహాత్ముడికి రాష్ట్రపతి - ప్రధాని, ఇతర నేతలు నివాళులు

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్వీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షుడు

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్వీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు, పలువురు ప్రతినిధులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
అలాగే, హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో మహాత్ముడికి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బాపూను స్మరించుకున్నారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
 
హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి ప్రముఖులు నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్ముడి సేవలను గుర్తు చేసుకున్నారు.