కలాం స్మారకార్థం అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్.. జెండాఊపనున్న ప్రధాని మోడీ
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ మండపం.. కలాంను ఖననం చేసిన రామేశ్వరంలోని పేయికరంబు ప్రాంతంలో నిర్మించారు. దీన్ని ప్రారంభం కోసం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి రామేశ్వరంకు చేరుకుంటారు. అలాగే, గ్రీన్ రామేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభిస్తారు.
ఈ స్మారక మందిరం ప్రారంభం తర్వాత కలాం స్మారకార్థం రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ వరకు నడిచే అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన జెండాఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రామేశ్వరం తర్వాత మానామదురై, తిరుచ్చి, తంజావూరు, విలుపురం, చెన్నై ఎగ్మోర్, గూడూరు, విజయవాడ, వరంగల్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, సాత్నా, అలహాబాద్, జౌన్పూర్, అయోధ్య స్టేషన్‌లలో ఆగుతుంది.
16793 నంబరుతో నడిచే రెగ్యులర్ వీక్లీ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 23.50 గంటలకు బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 15.00 గంటలకు చేరుకుంటుంది. అలాగే, గమ్యస్థానమైన ఫైసలాబాద్‌కు బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుతుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో (రైలు నంబరు 16794) ప్రతి బుధవారం రాత్రి 23.55 గంటలకు ఫైసలాబాద్‌లో బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 18.35 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి రామేశ్వరానికి శనివారం ఉదయం 8.50 గంటలకు చేరుతుంది.