మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (06:22 IST)

చివరకు అమ్మ ఇల్లు కూడా కొట్టేశారా? ఎంత దుర్మార్గమో!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన ఇల్లు పోయెస్ గార్డెన్ తమకు దేవాలయం వంటిదని, దాన్ని తమిళ ప్రజలందరూ స్మరించుకునే స్మారక మందిరంగా మారుస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారో లేదో అప్పుడే ఆ ఇల్లు జయది కాదని, అది తమదని శశికళ బ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన ఇల్లు పోయెస్ గార్డెన్ తమకు దేవాలయం వంటిదని, దాన్ని తమిళ ప్రజలందరూ స్మరించుకునే స్మారక మందిరంగా మారుస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారో లేదో అప్పుడే ఆ ఇల్లు జయది కాదని, అది తమదని శశికళ బంధువులు దస్తావేజులు చూపుతుండటం తమిళ ప్రజలను నివ్వెరపరుస్తోంది. దీంతో చెన్నై లోని పోయెస్‌ గార్డెన్‌లో దివంగత సీఎం జయలలితకు చెందిన ఇల్లు ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. 
 
1960ల మధ్యలో సినిమాల్లో నటిస్తున్నప్పుడు జయలలిత తన తల్లి సంధ్య పేరిట లక్షా యాభైవేల రూపాయలకు చెన్నైలో ఇల్లు కొన్నారు. అదే నేటి పోయెస్ గార్డెన్.  ఈ 50 ఏళ్ల కాలంలో ఆ ఇంటి విలువ దాదాపు 90 కోట్ల రూపాయలకు పెరిగింది. కన్నతల్లి మరణానంతరం ఆ ఇంటిని తనకు ఇవ్వమని జయ అన్న జయరామన్‌ కోరారు. తాను ఇక్కడే నివసిస్తానని, మరొకరికి ఇవ్వనని జయ చెప్పారు. జయ మరణిం చాక..ఆమెకు వారసులు లేకపోవడంతో ఆ ఇల్లు ఎవరికి సొంత మనే సందేహం తలెత్తింది.
 
ప్రస్తుతం రూ.90 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేశారు. సంధ్య మరణాంతరం ఆ ఇంటిని తనకు ఇవ్వాల్సిందిగా జయ అన్న జయరామన్‌ కోరారు. తాను ఇక్కడే నివసిస్తానని, మరొకరికి ఇవ్వనని జయ చెప్పారు. జయ మరణిం చాక..ఆమెకు వారసులు లేకపోవడంతో ఆ ఇల్లు ఎవరికి సొంత మనే సందేహం తలెత్తింది.
 
 జయ అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీప రక్త సంబంధీకులుగా ఉన్నారు. అయితే జయతోపాటు శశికళ కూడా అదే ఇంటిలో నివసించారు. ‘అమ్మ’ మరణం తరువాత కూడా అందులోనే ఉంటున్నారు. శశికళపై తిరుగుబాటు ప్రకటించిన పన్నీర్ సెల్వం తర్వాత జయ నివసించిన ఇల్లు తమకు దేవాలయం లాంటిదని, దీన్ని స్మారక మందిరంగా మారుస్తామని ప్రకటించారు. అయితే, ఈ ఇల్లు శశికళ సోదరుడి భార్య ఇళవరసి పేరున ఉన్నట్లు ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు వారి బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధిం చిన డాక్యుమెంట్లు కూడా చూపారు.
 
అంటే జయ ఇంటిపై కూడా ఆమె బంధువులకు ఏ హక్కులూ లేకుండా మన్నార్ గుడి ముఠా కొట్టేసిందా అంటూ తమిళ ప్రజలు ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. కోర్టుకెక్కినా ఆస్తి లావాదేవీలు పరిష్కారమవడానికి దశాబ్దాలు పడుతుంది కాబట్టి అంతవరకు జయ ఇల్లు శశికళ బంధువుల చేతిల్లో ఇరుక్కుపోవల్సిందేనని తెలుస్తోంద.