శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 27 జులై 2017 (22:23 IST)

తమిళనాడులో పోలీస్ అరెస్టు - ప్రజల సంబరాలు(వీడియో)

తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం

తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం పేట్టయ్ ప్రాంతానికి చెందిన ప్రజలు పోలీస్టేషన్ ముందు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి డ్యాన్సులు వేశారు. అంతటితో ఆగలేదు.. స్టేషన్ లోని మిగిలిన సిబ్బందికి స్వీట్లు కూడా పంచారు.
 
గతంలో ప్రతి కేసుకు సంబంధించి సిఐగా ఉన్న తమిళ్ మారన్ లంచం తీసుకుంటే తప్ప పనిచేసేవారు కాదని, దాంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించేవారని అక్కడి ప్రాంత వాసులు చెబుతున్నారు. సిఐని అరెస్టు చేసిన తరువాత మంగళం పేట్టయ్ వాసులు చేసుకున్న సంబరాలు చూసిన పొరుగున వున్న గ్రామాల ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.