శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (11:38 IST)

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కే మస్కా.. పెళ్లి పేరుతో అత్యాచారం

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కే సహచర పోలీస్ కానిస్టేబుల్ మస్కా కొట్టాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి, గుట్టుచప్పుడుకాకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని వెల్టూరు ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన తోటి ఉద్యోగిని అయిన మహిళా కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి గత కొంతకాలంగా ఆమెను శారీరంగా వాడుకున్నాడు.
 
ఈ సంబంధం 2015వ సంవత్సరం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బాధిత మహిళా కానిస్టేబుల్‌కు తెలియకుండా ఇటీవల మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నాగ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.