గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:46 IST)

అర్థరాత్రి టీటీవీ దినకరన్‌కు షాక్... ఢిల్లీ రావాలంటూ చేతికి సమన్లు

అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బహిష్కరణకుగురైన ఆ పార్టీ ఉప ప్రధానకార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్థరాత్రి దినకరన్‌కు ఢిల్లీ పోలీసు టీమ్

అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బహిష్కరణకుగురైన ఆ పార్టీ ఉప ప్రధానకార్యదర్శి, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్థరాత్రి దినకరన్‌కు ఢిల్లీ పోలీసు టీమ్ సమన్లు జారీచేసింది. 
 
ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఆయన క్రైమ్ బ్రాంచ్ టీమ్, చెన్నై, అడయారులోని దినకరన్‌ నివాసానికి వెళ్లి... సమన్లు చేతికి ఇచ్చింది. ఈవారంలోపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఇందులో పేర్కొన్నారు.
 
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీలో సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌‍పై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ కేసులోనే ఆయనకు సమన్లను స్వయంగా అందజేయడం జరిగింది.