గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (09:33 IST)

జయకు మోడీకి సన్నిహితుడు చో రామస్వామి కన్నుమూత.. అదే అపోలోలో చికిత్స పొందుతూ..

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి(82) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4.40గంటలకు మృతిచెందారు. ఆయన పూర్తి పేరు శ్రీనివాస అయ్యార్‌ రామస్వామి. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు.
 
'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణకు ఆయన దగ్గరి బంధువు. మేనమామ అవుతారు. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా చో రామస్వామి సన్నిహితుడు. దేశంలోని అనేకమంది రాజకీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చో రామస్వామి 1999-2005 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.