శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra

వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికుడు ఆత్మహత్య.. రాహుల్ గాంధీని 4 గంటల్లో రెండుసార్లు అరెస్ట్ చేశారు..

ఢిల్లీలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపుతోంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్లను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ... రాం కిషన్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే

ఢిల్లీలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపుతోంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్లను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ... రాం కిషన్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు తన మరణాన్ని జవాన్లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించి జంతర్ మంతర్ దగ్గర తన ప్రాణాలు తీసుకున్నారు. తన చావు ద్వారానైనా ప్రభుత్వం మాజీ సైనికులకు న్యాయం చేయాలని రాం కిషన్ వేడుకున్నారు. అతడి మృతదేహాన్ని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 
 
మొదట మధ్యాహ్నం సమయంలో ఆయన ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి తిక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు నిర్భంధంలో ఉంచి అనంతరం విడుదల చేశారు. సాయంత్రం మళ్లీ రాహుల్ ఆసుపత్రికి వెళ్లగా అతడిని అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేవలం నాలుగు గంటల సమయంలోనే రాహుల్ రెండు సార్లు అరెస్టుకు గురయ్యారు.
 
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాను పోలీసులు ఆసుపత్రిలోకి అనుమతించలేదు. కాసేపు అదుపులోకి తీసుకుని నిర్భంధించారు. గ్రేవాల్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి వచ్చినవారిని అడ్డుకోవడమేమిటని రాహుల్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.  ఇది చాలా బాధకరమైన విషయమని, సైనికుల హక్కుల కాపాడటం కోసం ప్రభుత్వం మద్దతుగా నిలవాలని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు.