సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2024 (17:03 IST)

27 ఏళ్లకే ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ అబ్రదీప్ కన్నుమూత, కారణం అదే

Popular YouTuber Angry Rantman
యాంగ్రీ రాంట్‌మన్ అని పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ అబ్రదీప్ సాహా 27 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గత నెలలో అతడికి పెద్ద శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇక అప్పట్నుంచి అతడు ఆసుపత్రిలో వుంటూ కోలుకునే క్రమంలో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఏప్రిల్ 16వ తేదీన అతడు మరణించడానికి చెపుతున్నారు. ఐతే అతని మరణానికి ఖచ్చితమైన కారణం అధికారికంగా బహిర్గతం చేయనప్పటికీ, శస్త్రచికిత్స తర్వాత ఏర్పడిన సమస్యల కారణంగా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడని అంటున్నారు.
 
యాంగ్రీ రాంట్‌మన్ క్రీడలపై, ముఖ్యంగా ఫుట్‌బాల్‌పై అతని కంటెంట్‌కు ప్రసిద్ధి చెందాడు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఫిబ్రవరి 19, 1996న జన్మించిన అతను కోల్‌కతాకు చెందినవాడు. యూట్యూబ్‌లో 481k సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 119k ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
 
అతని ఆకస్మిక మరణం అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంతాపం వెల్లువెత్తుతోంది.