ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఎక్స్ (ట్విట్టర్)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత ఎన్నికల సంఘం... ఎందుకో మరి?

Twitter
ఎక్స్ (ట్విట్టర్)కు భారత ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమరం జరుగుతుంది. ఇందులోభాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. దీంతో ఎక్స్‌కు ఈసీ ఓ హెచ్చరిక చేసింది. ట్విట్టర్ ఖాతాలోని రాజకీయ ప్రేరేపిత పోస్టులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, ఇతర రాజకీయ అసభ్యకర పోస్టులు తొలగించాలని సూచించింది. దీంతో ఎక్స్ కూడా మరో గత్యంతరం లేక తొలగించింది. ఇలాంటి ఆదేశాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది.
 
భావ ప్రకటన స్వేచ్ఛకు ఎక్స్ ప్రాధాన్యం కల్పిస్తుందని పేర్కొంటూ పోస్టులను హోల్డ్‌లో పెట్టిన ఖాతాదారులకు ఈ విషయంపై సమాచారం అందించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను కూడా ఎక్స్ బహిర్గతం చేసింది. ఎన్నికల కోడ్‌ను అతిక్రమించేలా ఉన్న రాజకీయ పోస్టులను తొలగించాలని ఈసీ జారీచేసిన హెచ్చరికలను యధాతథంగా పోస్ట్ చేసింది. 
 
బుల్లెట్ రైలులోకి పాము ఎలా వచ్చింది... ప్రయాణం 17 నిమిషాలు ఆలస్యం!! 
 
ప్రపంచంలో జపాన్ బుల్లెట్ రైళ్లకు ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. వేగానికి మారు పేరుగా ఈ రైళ్లను చెబుతారు. అలాంటి రైలులో పాము చేరిపోయింది. ఈ కారణంగా ఆ రైలు ప్రయాణం 17 నిమిషాల పాటు ఆలస్యమైంది. సాధారణంగా పాము వల్ల రైలు ప్రయాణం ఆలస్యం కావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటన ఇపుడు జపాన్ నగరంలో చోటుచేసుకుంది. 
 
రైలులో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ బోగీలోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించి గమ్యస్థానానికి చేర్చారు. అయితే, ఆ బుల్లెట్ రైలులోకి ఆ పాము ఎలా వచ్చిందన్నది తెలియలేదు. అలాగే, ఆ పాము కూడా విషపూరితమా కాదా అన్నది కూడా తెలియరాలేదు. 
 
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే కావడం గమనార్హం.