గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:30 IST)

సరుకుల కోసం పక్కూరికెళ్లిన తల్లి - కుమార్తెను కాటేసిన కన్నతండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడుగా మారిపోయాడు. ఫలితంగా కన్నతండ్రిపై అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో జరిగింది. 15 ఏళ్ల కుమార్తెపై కన్నతండ్రే పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెను చెరబట్టాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అప్పటి నుంచి పలుదఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరించేవాడు. తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. 
 
పోలీసులు వెళ్లి మందలించారు. ఆ తరువాత బాలిక.. అవ్వ, తాతల ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.