మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (13:30 IST)

హాలీవుడ్ స్టార్ హీరో తండ్రి కన్నుమూత

హాలీవుడ్ స్టార్ హీరో, ఐరన్‌మ్యాన్‌ హీరో రాబర్ట్‌డానీ జూనియర్‌ తండ్రి సీనియర్‌ రాబర్ట్‌ డానీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూ రాగా, గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 85 యేళ్లు. 
 
గత ఐదేళ్లుగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూ వచ్చారు. మంగళవారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నటుడిగా కెరీర్‌ ఆరంభించిన రాబర్ట్‌ డానీ సీనియర్‌.. తక్కువ బడ్జెట్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన కొడుకు రాబర్ట్‌ డానీ జూనియర్‌ నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మంచి పేరు దక్కించుకున్నాడు.