మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (18:24 IST)

అమీర్ ఖాన్, కిరణ్ రావ్‌ల విడాకులు.. కుమార్తె పోస్ట్.. కారణం ఏమిటి?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావ్‌లు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియగానే వారి అభిమానులే కాకుండా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా షాకయ్యారు. ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న అమిర్ ఖాన్, కిరణ్ రావ్‌లు తాము ఎప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించారు.
 
ఇటువంటి పరిస్థితులు నేపధ్యంలో అమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. కొద్ది నిమిషాల్లోనే ఇది వైరల్‌గా మారింది. ఇరా ఖాన్ సినీ నటి కాకపోయినప్పటికీ, అమీర్ ఖాన్ కుమార్తె అయినందున సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటారు. కాగా ఇరా ఖాన్ తన పోస్టులో... తదుపరి రివ్వ్యూ రేపు... మున్ముందు ఏమి జరగబోతోందో? అని రాశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 
 
ఇరా ఖాన్ ఏవిషయమై ఈ పోస్టు పెట్టారో అర్థం కావడంలేదని కొందరు అభిమానులు అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అమిర్ ఖాన్ దంపతుల విడాకుల వ్యవహారం... వారి కుమార్తె సోషల్ మీడియా పోస్టుతో మరిన్ని చర్చలకు దారితీస్తోంది.