మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (14:39 IST)

అత్తగారు డబ్బులు ఇవ్వలేదని.. వేడినూనె పోసి దాడి..!

Oil
అత్తమామల వేధింపులతో కోడళ్లు ఇబ్బంది పడే సంఘటనలు తెలుసుకుని వుంటాం. కానీ కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కోడలు అత్తగారు డబ్బులు ఇవ్వలేదని ఆమెపై వేడినూనె పోసి దాడి చేసింది. గుడివాడ పరిధిలోని మందపాడులో నివసించే చుక్కాలక్ష్మీ అనే మహిళకు జగనన్న చేయూత డబ్బులు వచ్చాయి. 
 
ఆమె కోడలు స్వరూప అత్తగారిని ఆ డబ్బులు ఇవ్వమని అడిగింది. అత్తగారు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో అత్తమీద కోపం పెంచుకున్న కోడలు అదివారం ఉదయం నిద్రపోతున్న అత్తగారు చుక్కాలక్ష్మిపై వేడి నూనె పోసింది.
 
తీవ్రగాయాలు పాలైన అత్త లక్ష్మిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కోడలు స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.