బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ "వీడీ 14". ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. విజయ్ సరసన రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.
బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో "వీడీ 14" ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది.