15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై-అమీర్ ఖాన్ దంపతుల సంయుక్త ప్రకటన
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్నారు. 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ పదిహేను సంవత్సరాలు ఎంతో మధురంగా గడిచాయి.
ఒకరిపై ఒకరం నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇక నుండి మేం భార్యాభర్తలం కాదు… కానీ పిల్లలకు కో పేరేంట్స్‌గా ఉండబోతున్నాం అని ఇద్దరు కలిసి ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇద్దరం కలిసి సినిమాలు చేస్తూనే ఉంటామని ప్రకటించారు.
ఈ మేరకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ వైవాహిక బంధంలోని ఎన్నో తీపి జ్ఞాపకాలు, చిరునవ్వులు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు. ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నట్లు చెప్పారు.
అయినప్పటికీ, తమ కుమారుడి బాధ్యతను ఇద్దరం తీసుకుంటామని తెలిపారు. సినిమాలు, పానీ ఫౌండేషన్ కార్యకలాపాల్లో కలిసే పనిచేస్తామని చెప్పారు. తాము విడిపోవాలని కొంత కాలం క్రితమే నిర్ణయం తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని వివరించారు.
కాగా, ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకుని, 2002లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కిరణ్ రావ్‌ను 2005లో ఆమిర్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతోనూ విడిపోతున్నాడు.