బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (15:59 IST)

యామి గౌతమ్‌కు చిక్కు.. ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

యామి గౌతమ్ కొద్ది రోజుల క్రితం ఉరీ ఫేమ్ ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యమీ గౌతమ్ కొత్త ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. యామీ గౌతమ్‌కు విదేశీ మారకద్రవ్యం ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటిసులు పంపించింది. వచ్చే వారం తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) యామి గౌతమ్‌‌కు నోటిసులు పంపింది. 
 
ఫెమా (Foreign Exchange Management Act) కింద జరిగిన అవకతవకలకు సంబంధించి ఈడీ ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. యామీ గౌతమ్ తెలుగులో రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ కొరియర్‌బాయ్ కళ్యాణ్, అల్లు శిరీష్ గౌరవం లాంటీ సినిమాల్లో నటించింది.