సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (09:15 IST)

ప్రకాశం జిల్లాకు తొలి మహిళా ఎస్పీ మల్లికా గార్గ్

ప్రకాశం జిల్లా కు తొలిసారిగా ఒక మ‌హిళా ఎస్పీ రానున్నారు. ప్రకాశం జిల్లా పోలీస్ అధికారి నియామకం విషయంలో కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ని కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించారు. ఆయన స్థానంలో జిల్లా ఎ.ఎస్పీ చౌడేశ్వరిని ఇంఛార్జి ఎస్పీగా నియమించారు.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరు అనే చర్చకు తెర పడింది. కృష్ణా జిల్లా ఎ.ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్‌ని ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించింది.

ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమితులైన మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన పోలీస్ అధికారిణి. మల్లికా గార్గ్ ఇపుడు ప్రకాశం జిల్లాలో తొలి మహిళా ఎస్పీగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు.