సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 అక్టోబరు 2018 (16:05 IST)

శిరిడీ సాయి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ...

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్శంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. 
 
శతాబ్ది ఉత్సవాల స్మారకంగా వెండి నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను మోదీ అందజేశారు.