శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (09:43 IST)

చెన్నైలో ప్రైవేట్ పాల ధరల పెంపు.. ఆవిన్ కంటే.. ఇతర సంస్థలు రూ.8 పెంచేశాయ్

చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకె

చెన్నైలో పాల ధరలు పెరగనున్నాయి. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న పాలు, పాల ఉత్పత్తులు పెరగనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా డోల్టా, తిరుమల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ.2 పెంచారు. సోమవారం నుంచి ఈ ధరలు అమలుకు వస్తాయి. ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న ఆవిన్‌ పాల కంటే ఇతర పాల సంస్థలు రూ.8 పెంచడం గమనార్హం. 
 
దీని గురించి రాష్ట్ర పాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి మాట్లాడుతూ, ప్రైవేటు సంస్థల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలుమార్లు తాము కోరినప్పటికీ ఎలాంటీ ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలను కలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనునట్లు హెచ్చరించారు.