శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (12:22 IST)

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వమన్నాడు.. జైలుకెళ్లాడు

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అర

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధిత విద్యార్థిని జూనియర్ కాలేజీలో కామర్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలని ప్రొఫెసర్ డిమాండ్ చేశాడు. తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ అడగడంతో ప్రొఫెసర్ సంగతిని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు ఈ కేసులో నిందిత ప్రొఫెసర్‌పై సత్వర చర్యను తీసుకునే విధంగా మద్దతు కోసం వారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఫలితంగా నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.