బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (16:11 IST)

యువతి ప్రైవేట్ ఫోటోలు నెట్లో పెట్టాడు.. ఐదేళ్ల జైలుశిక్షకు గురయ్యాడు..

సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు, ఫేస్‌బుక్ ప్రేమాయణాలు ప్రస్తుతం బాగా ఫ్యాషన్ అయిపోయాయి. అయితే ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారిత

సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు, ఫేస్‌బుక్ ప్రేమాయణాలు ప్రస్తుతం బాగా ఫ్యాషన్ అయిపోయాయి. అయితే ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో యువతరానికి అంతగా అర్థం కావట్లేదు. యువత సోషల్ మీడియాతో అప్రమత్తంగా వుండాలని ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టినా.. ఆన్‌లైన్‌ పరిచయాలతో మోసపోయే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అలాంటి ఘటనే యువతికి ఎదురైంది. 
 
ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ యువతి ప్రైవేట్ ఫోటోలను నెట్లో అప్ లోడ్ చేసిన చేసిన ఓ బీటెక్ స్టూటెండ్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో కోల్‌కతా ఈస్ట్ మిడ్నాపూర్‌లోని తమ్లుక్‌ కోర్టు ఈ మేరకు సత్వర తీర్పునిచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందిత బీటెక్ విద్యార్థి అనిమేశ్ జూలై 21, 2017న అరెస్టయ్యాడు. ఈ కేసుపై వాదనలు పూర్తికావడంతో అతనికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
నిందితుడు తనకు మూడేళ్లుగా తెలుసునని.. అందుకే అతడిని గుడ్డిగా నమ్మినట్లు కోర్టుకు బాధితురాలు తెలిపింది. అతను తన ప్రైవేటు ఫోటోలను వీడియోలను తీసుకున్నాడని.. ఆపై శారీరక సంబంధం పెట్టుకోని పక్షంలో నెట్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అతని కోరికను కాదనడంతో అన్నంత పని చేశాడని బాధితురాలు వాపోయింది. అయితే కోర్టు తీర్పు యువతులను బెదిరించే యువకులకు చెంపపెట్టు లాంటిదవి మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.