1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (12:01 IST)

ఇద్దరు విద్యార్థినులతో ప్రొఫెసర్ ప్రేమాయణం.. ఆపై పెళ్లి...

ఉపాధ్యాయుడు ఉద్యోగానికి ఉన్న ప‌విత్ర‌త రోజురోజుకి దిగ‌జారుతోంది అన‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. నిత్యం వార్త‌ల్లో ఏదో ఒక సంద‌ర్భంలో ఉపాధ్యాయుడు - విద్యార్థికి మ‌ధ్య సంబంధాల‌పై వార్త‌లు వ‌స్తూనే ఉన్న

ఉపాధ్యాయుడు ఉద్యోగానికి ఉన్న ప‌విత్ర‌త రోజురోజుకి దిగ‌జారుతోంది అన‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. నిత్యం వార్త‌ల్లో ఏదో ఒక సంద‌ర్భంలో ఉపాధ్యాయుడు - విద్యార్థికి మ‌ధ్య సంబంధాల‌పై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ఒకేసారి ఇద్దరు కళాశాల విద్యార్థినులతో ప్రేమాయణం సాగించి వివాహమాడిన ప్రొఫెసర్‌ గుట్టు బయటపడింది. ఆ వివరాలను పరిశీలిస్తే... ధర్మపురి జిల్లా ఇండూరు సమీపంలోగల నెక్కుంది గ్రామానికి చెందిన బాలచంద్రన్ (31). ఈయన అరియలూరు జిల్లాలోని ఒక ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 
 
కాగా ఈయనకు నాలుగేళ్ల క్రితం ధర్మపురిలోగల కళాశాలలో పనిచేస్తున్నప్పుడు అను అనే విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అదేసమయంలో ధర్మపురిలోగల మరో కళాశాల విద్యార్థినితో బాలచంద్రన్ ప్రేమాయణం సాగించాడు. ఇలావుండగా అను, బాలచంద్రన్ తల్లిదండ్రుల అనుమతితో మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్నవీరిద్దరి మధ్య కలతలు మొదలైంది. పుట్టింటి నుంచి నగలు, నగదు తెమ్మని బాలచంద్రన్ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. 
 
అతని ఆగడాలను భరించలేని అను పెన్నాగరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలచంద్రన్ ఇల్లు విడిచి పారిపోయాడు. అతని కోసం కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే అనుకోకుండా భర్త బాలచంద్రన్ ఫేస్‌బుక్ అకౌంట్‌ని చూసింది. అందులో వేరొక అమ్మాయితో అతను ఉన్నట్లు తెలిసి నివ్వెరపోయింది. దీనిగురించి ఆమె పెన్నాగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు ఇన్‌స్పెక్టర్ పావాయి విచారణ జరిపారు. అను ఇంటి నుంచి వెళ్లిపోగానే బాలచంద్రన్ మరొక యువతిని వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో బాలచంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.