బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (08:52 IST)

పోలీస్ వాహనంపై యువతి రీల్స్... అనుమతిచ్చిన పోలీస్‌ అధికారిపై వేటు

girl reels
పంజాబ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. రీల్స్ కోసం ఓ యువతి పోలీస్ వాహనంపైకి ఎక్కి, తనకు కావాల్సిన రీల్స్ చేసుకుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే.. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పోలీస్ అధికారిపై చర్య తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మ.. ఓ యువతి కారుపై కూర్చొని రీల్స్ వీడియో చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆమె కారు బానట్‌పై కూర్చొని డ్యాన్స్ చేస్తున్నట్టు చేతులు ఊపింది. అంతేకాకుండా, అభ్యంతకర రీతిలో వేళ్లతో సైగలు చేసింది. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. అంతే.. నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యువతి పోలీస్ వాహనంపైకి ఎక్కేందుకు అనుమతి ఇచ్చిన అశోక్ శర్మపై సస్పెండ్ చేశారు.