శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (15:30 IST)

తన ప్రియురాలిని పెళ్లాడుతున్నాడని ఆ జవాను ఏం చేశాడో తెలుసా?

దేశం కోసం ప్రాణాలర్పిస్తారు జవానులు. కానీ ఈ జవాను మాత్రం తన ప్రియురాలు తనకు దక్కలేదన్న కసితో ఆమెను వివాహం చేసుకోబోయే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో ఆర్మీ జవాన్‌ కమల్‌ దేవ్‌, శివాని శర్మ అనే యువతి

దేశం కోసం ప్రాణాలర్పిస్తారు జవానులు. కానీ ఈ జవాను మాత్రం తన ప్రియురాలు తనకు దక్కలేదన్న కసితో ఆమెను వివాహం చేసుకోబోయే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో ఆర్మీ జవాన్‌ కమల్‌ దేవ్‌, శివాని శర్మ అనే యువతి కొంతకాలం క్రితం ప్రేమించుకుని, వారి వివాహానికి పెద్దలు వ్యతిరేకించడంతో విడిపోయారు. కానీ అతడు మాత్రం ప్రియురాలిని వదల్లేదు. ఆమెను నీడలా వెంటాడుతూనే వున్నాడు.
 
ఈ క్రమంలో ఆమెకు వేరే యువకుడితో పెద్దలు నిశ్చితార్థం చేశారు. దీనితో వారిరువురూ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా పొరుగు ఊర్లకు వెళ్లి షాపింగ్, వగైరాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు తమ సొంత ఊరు ఉనా నుంచి నాలాగఢ్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. వీరి కదలికలను గమనిస్తున్న కమల్ వారిని వెంబడించాడు. బస్సు స్టేషనులో తన మాజీ ప్రేయసి, ఆమెకు కాబోయే భర్త కలిసి వెళుతుండగా వెనక నుంచి వెళ్లి పదునైన కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో మాజీ ప్రియురాలికి కాబోయే భర్త అక్కడికక్కడే మరణించగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.