ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (20:11 IST)

కోడలిపై మామ అత్యాచారయత్నం.. వీడియో తీసి భర్తకు షాకిచ్చింది..

కొత్తగా అత్తగారింట అడుగుపెట్టిన కోడలికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లైన కొద్ది రోజులకే కోడలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించిన మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని పండ్రవాడ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఐదు నెలల క్రితం ఓ యువకుడికి, యువతికి డిసెంబర్ 19న వివాహం జరిగింది. 
 
పెళ్లై అత్తవారింట్లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఆమెకు అనుకోకుండా తన మామ తరపు నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మామా తన కోడలిపై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తన అత్త, భర్తకు చెప్పినా నమ్మలేదు. అయితే వారిని ఎలాగైనా నమ్మించాలనే సమయంలో ఇంట్లో కోడలు ఒంటరిగా వున్నప్పుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. 
 
కానీ అతడి నుంచి తప్పించుకున్న యువతి.. వీడియో ద్వారా ఆధారాలను సహా చూపెట్టడంతో భర్త షాక్ చిన్నాడు. చివరికి తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీనితో అత్యాచారం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా సదరు నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.