1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:53 IST)

గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం మాదేనన్న మనోహర్ పారికర్

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఒటు హక్కును వినియోగించుక

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఒటు హక్కును వినియోగించుకున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదు అయింది. గోవా అసెంబ్లీ ఎనికల్లో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. 
 
ఉదయం 9 గంటలకే 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉత్తర గోవా ప్రాంతంలో అత్యధికంగా 16 శాతం, దక్షిణ గోవాలో 14 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మీద గోవాలో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
 
పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ గోవాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అవుతుందని.. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ పంజాబ్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అక్కడ ఉదయం 9:30 గంటలకు 8 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.