శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (11:53 IST)

ఫిరోజ్‌పూర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ బాంబు కలకలం

పంజాబ్ రాష్ట్రంలోని భారత్ - పాకిస్థాన్ సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబును స్థానిక పోలీసులు గుర్తించి, దీన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
పోలీసుల ప్రాథమిక విచారాణలో ఈ టిపిఫన్ బాక్సును జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే అమర్చినట్లు గుర్తించారు. కాగా, ఇప్పటికే ఈ పేలుడుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వీరివద్ద జరిపిన విచారణలో ఈ టిఫిన్ బాంబు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
దీంతో పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జ‌లాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జ‌శ్వంత్ సింగ్, బ‌ల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ సింగ్‌‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు.