ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 మార్చి 2021 (17:38 IST)

భోపాల్ పొలాల్లో కుప్పకూలిన విమానం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. ప్రైవేటు సంస్థ విమానం భోపాల్ నుంచి గునాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
 
భోపాల్ నుంచి టేకాఫ్ తీసుకోగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి బీషన్ఖేరి ప్రాంతంలోని పొలంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో, పైలట్ కెప్టెన్ అశ్విని శర్మతో సహా ముగ్గురు వ్యక్తులు విమానంలో ఉన్నారు. వారిని చికిత్స కోసం హమీడియా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విమానం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సర్వే పనులు చేస్తున్నట్లు సమాచారం.