విమానంలో పిల్లి.. పైలెట్‌పై దాడి.. యూటర్న్ తీసుకుని సూడాన్‌లో?
విమానంలో ఓ పిల్లి రచ్చ రచ్చ చేసింది. కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించింది. ఆ పిల్లి దెబ్బకు విమానాన్ని గాల్లోనే యూటర్న్ చేసి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సూడాన్‌లో ఈ ఘటన జరిగింది. ఖతార్ రాజధాని అయిన దోహాకు వెళ్లవలసిన ఈ విమానం, షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ పిల్లి చేసిన హడావిడికి సుడానీస్ రాజధాని నగరమైన ఖార్టూమ్‌లోనే మరలా దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన బుధవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. సుడాన్ టార్కో విమానం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. బయలు దేరిందే గానీ గమ్యానికి చేరుకోలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పిల్లి పైలట్‌పై దాడి చేయడం వల్ల అరగంట సేపు విమానం గాలిలోనే ఉండాల్సి వచ్చింది.
స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానం బయలుదేరే ముందు ఎలా చొరబడిందో గానీ కాక్ పిట్‌లోకి ప్రవేశించింది. మొత్తానికి ఆ తర్వాత కాక్‌పిట్‌లో దీన్ని గమనించి, బయటకు పంపేయడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. అది కెప్టెన్‌పై కూడా దాడి చేసింది.
కాక్ పిట్‌లో ఏర్పడిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్‌కు మరో దారి లేక ఖార్టూమ్‌కు తిరిగి రావడం తప్పనిసరి అయ్యింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. ఇంతకీ ఈ విమానంలోకి పిల్లి ఎలా వచ్చి, చేరిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.