1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (09:48 IST)

పంజాబ్ రాజకీయాలు : కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య.. సొంత గూటికి మాజీ క్రికెటర్..?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ పార్టీని స్థాపించడం తెలిసిందే. కౌర్‌ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు.  సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి.