ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:32 IST)

ఢిల్లీ విమానాశ్రయంలో రేడియో ధార్మికత లీక్... టీ-3 కార్గో మూత

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-3 కార్గో ప్రాంతంలో రేడియో ధార్మిక పదార్థం లీక్ అయినట్టు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు... తక్షణం ఎమర్జెన్సీని ప్రకటి

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-3 కార్గో ప్రాంతంలో రేడియో ధార్మిక పదార్థం లీక్ అయినట్టు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు... తక్షణం ఎమర్జెన్సీని ప్రకటించి, ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా ఖాళీ చేయించారు. 
 
అలాగే, ప్రాంతంలో నాలుగు ఫైర్ ఇంజన్లను మోహరించారు. జాతీయ విపత్తు నివారణ బృందం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అధికారులు ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కార్గో టర్మినల్ మొత్తాన్ని ఖాళీ చేయించామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
 
ఓ విమానంలో ఫ్రాన్స్ విమానం నుంచి వచ్చిన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నుంచి రేడియో ధార్మిక పదార్థం లీకైనట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.