1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (10:46 IST)

అప్పు చెల్లించలేక పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికిచ్చారు

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు త

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో కలురాం అనే వ్యక్తి బాలురాం అనే వ్యాపారి వద్ద రూ.20 వేల నగదు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించలేనని ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన తన భార్యతో కలిసి వెళ్లి వ్యాపారి బాలురాంకు కొడుకును ఇచ్చాడు. 
 
ఆ పసికందును ఏం చేయాలో తెలియని వడ్డీవ్యాపారి శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగించి జరిగిన ఉదంతాన్ని వారికి వివరించారు. ఆ చిన్నారికి సంరక్షణ కేంద్రం సిబ్బంది బర్ధన్ అనే పేరు పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని శిశుసంరక్షణ అధ్యక్షురాలు మాయ సుబల్కా తెలిపారు.