బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (09:51 IST)

రాజకీయాల్లోకి వస్తే రాణించగలనా? కింగ్‌నవుతానా? జ్యోతిష్కులను ఆశ్రయించిన రజనీ

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై ఊగిసలాట ధోరణిని అవలంభిస్తున్నారు. దీనికి ఉదాహరణే.. తాజాగా ఆయన పలువురు జ్యోతిష్కులను సంప్రదించడం. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వస్తే రాణించగలనా? లేదా అ

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై ఊగిసలాట ధోరణిని అవలంభిస్తున్నారు. దీనికి ఉదాహరణే.. తాజాగా ఆయన పలువురు జ్యోతిష్కులను సంప్రదించడం. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వస్తే రాణించగలనా? లేదా అనే అంశంపై పలువురు జోస్యులను అడిగినట్టు సమాచారం.
 
రాజకీయాల్లో రాణించగలనా? లేదా? అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడితే కింగ్‌ అవుతానా? లేక కింగ్‌మేకర్‌ అవుతానా? అన్నది తెలుసుకునేందుకు నలుగురు జ్యోతిష్కులతో వేర్వురుగా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ముగ్గురు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. ఒక్కరు మాత్రం ‘రాజకీయాలు మీకు అంతగా అచ్చిరావు’ అని తేల్చిచెప్పారట. 
 
ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఓ జ్యోతిష్కుడు, కర్ణాటకు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు సమాచారం. ఈ నలుగురి సూచనలు సలహాలు శ్రద్ధగా ఆలకించిన రజనీకాంత్ జూలై నెలలో అమెరికాకు వెళ్లి వచ్చాక మరోమారు జ్యోతిష్యులను సంప్రదించాలని నిర్ణయించారు.