శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (14:44 IST)

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రజనీకాంత్.. ప్రధానితో భేటీ అందుకేనా?

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై హైడ్రామా జరుగుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సొంత కుంపటి పెట్టుకుంటారని కొందరు అంటుంటే.. బీజేపీలో చేరుతారని మరికొందరు అంటున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్ర

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై హైడ్రామా జరుగుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సొంత కుంపటి పెట్టుకుంటారని కొందరు అంటుంటే.. బీజేపీలో చేరుతారని మరికొందరు అంటున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కోడంబాక్కంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఫ్యాన్స్‌తో రజనీ తలపెట్టిన వరుస భేటీలు, ఆయా మీటింగ్స్‌లో రజనీ చేస్తున్న వ్యాఖ్యలు వదంతులకు బలాన్నిచ్చాయి. 
 
తాజాగా రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ గురించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. మంచి వ్యక్తుల్ని రాజకీయాల్లో స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రజనీకాంత్‌ను గురించి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. మాజీ బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ రజనీకాంత్ గురించి మరో కామెంట్ చేశారు. రజనీకాంత్‌కు బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడంతో రజనీకాంత్ తప్పకుండా బీజేపీ గూటికే చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. గడ్కరీ వ్యాఖ్యలతో రజనీ రాజకీయ ప్రవేశం తమిళ  రాజకీయాలతోపాటు, దక్షిణాదిలోనూ ఇదో హాట్ టాపిక్‌గా మారింది. 
 
అలాగే వచ్చే ఎన్నికల్లోపు తమిళనాట పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు రజనీకాంత్‌ను అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రజనీకాంత్ వరుసగా ఐదు రోజులపాటు తన అభిమానులతో జరిపిన సమావేశాలు రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన మనోగతాన్ని వెల్లడి చేశాయి. దీంతో రజనీకాంత్‌ను బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ ప్లాన్ వేసేసింది. ఈ క్రమంలో ఢిల్లీకి రావాల్సిందిగా మోడీ నుంచి రజనీకాంత్‌కు పిలుపు వచ్చేసింది. రజనీకాంత్-మోడీల భేటీ తమిళ రాజకీయాల్లో పెను మార్పులను సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు.