శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (14:17 IST)

రామ్మోహన్ రావుకు ఉద్వాసన... సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్.. ఈమె ఎవరో తెలుసా?

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పి రామ్మోహన్ రావుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పి రామ్మోహన్ రావుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు సీఎస్‌గా ఉన్న పి.రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిపిన విషయం తెల్సిందే. దీంతో ఆయనకు ఉద్వాసన పలికారు. దివగంత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఆయన సీఎస్‌గా నియమితులయ్యారు. 
 
రామ్మోహన్ రావు తనయుడు, బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్‌సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
 
అందులోనే సీఎస్‌ను తప్పించాలని గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందు నుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహన్ రావు 1985 తమిళనాడు బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్. ఈయన భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వెంకట్రామన్ కుమార్తె. అలాగే, తమిళ హాస్య నటుడు ఎస్వీ.శేఖర్ సోదరుడి భార్య కూడా.