బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (12:10 IST)

బాహుబలి ఎఫెక్ట్.. రానా వాహనం స్ఫూర్తితో ''దుర్గ్‌ రోడ్ క్లీనర్''

బాహుబలి సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు బాహుబలిగా అభివర్ణించుకుంటున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మున్సిపాలిటీ ఓ అడుగు ముందుకేసింది. బాహుబలి సినిమాలో

బాహుబలి సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు బాహుబలిగా అభివర్ణించుకుంటున్నారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ మున్సిపాలిటీ ఓ అడుగు ముందుకేసింది. బాహుబలి సినిమాలో యుద్ధ సమయంలో భల్లాలదేవ (రానా) రథం శత్రుమూకను ఎలా ఛండాడిందో.. సినిమా చూసిన ప్రతివారికీ గుర్తుండే వుంటుంది. అలాంటి రథంతోనే ఓ వాహనాన్ని తయారు చేసింది. 
 
ఈ వాహనం దుర్గ్ రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని ఊడ్చిపారేస్తోంది. బాహుబలి సినిమాలో భల్లాలదేవ రథానికి ఉన్న కత్తుల స్థానంలో దుర్గ్ వాహనానికి చీపుర్లున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను తగ్గించాలనుకున్న దుర్గ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తక్కువమంది సిబ్బందితోనే దుర్గ్‌రోడ్లు తళతళలాడిపోతున్నాయని మున్సిపాలిటీ అధికారులు చెబతున్నారు.
 
ఈ వాహనానికి మున్సిపాలిటీ... 'దుర్గ్‌ రోడ్ క్లీనర్' అని పేరుపెట్టింది. అయితే, ఆ వాహనం రోడ్డుపై చెత్తా, చెదారాన్ని శుభ్రం చేస్తున్న సంగతిని పక్కనబెడితే.. ఆ వాహనం చీపుర్లు తిరిగే స్పీడుకు రోడ్లపైన చెత్తా, చెదారం రోడ్ల పక్కన ఉన్న షాపులు, వాహనాలు, ప్రజలపైనా చెత్తాచెదారం పడుతోందట.