శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (23:03 IST)

రాంగోపాల్ వర్మ బయోపిక్ 'పెప్పర్ స్ప్రే'

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై తానే తీసుకోబోయే బయోపిక్ కి వర్మ పెట్టబోతున్న పేరు 'పెప్పర్ స్ప్రే'.  ఈ పేరు పెట్టడం వెనుకున్న ఆసక్తికరమైన విషయం ఇటీవల వర్మ షేర్ చేసుకున్నాడు. 
 
లాక్ డౌన్ పీరియడ్లో అస్సలు ఖాళీ లేకుండా సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేస్తున్న వర్మ.. కొత్తకొత్త నటులను పరిచయం చేశాడు. అలా పరిచయం అయిన ఒడిసా ముద్దుగుమ్మ అప్సరరాణి..తనతో ఇప్పటివరకు థ్రిల్లర్.. మరో లెస్బియన్ లవ్ స్టోరీ చిత్రీకరించాడు వర్మ. 

థ్రిల్లర్ కి ముందు పేరు కూడా పెద్దగా తెలియని అప్సరరాణి వర్మ ఫోటోషూట్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తనతో కలిసి ఇటీవల ఒక లైవ్ ఛాట్ లో పాల్గొన్నాడు. అప్పుడే తన బయోపిక్ గురించి ఆసక్తికర విషయం చెప్పాడు.
 
మీ బయోపిక్ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు.. "త్వరలో తీస్తాను. 24 నిమిషాల డ్యురేషన్ ఉండే ఈ సినిమా పేరు పెప్పర్ స్ప్రే. ఇది పెట్టడానికి కారణం అప్సరరాణి యే" అంటూ చెప్పుకొచ్చాడు. తనని ఫస్ట్ టైం కలవడానికి వచ్చినప్పుడు బ్యాగ్లో ఏం ఉన్నాయని అడిగిన ప్రశ్నకు పెప్పర్ స్ప్రే అని బదులిచ్చిందట అప్సర.

ఎందుకు అని అంటే..అప్పటివరకు వర్మ గురించి తను విన్న కామెంట్ల గురించి చెప్పిందట. ఉమనైజర్, ఆడవాళ్లంటే పడిచస్తాడు లాంటి కామెంట్స్ విన్నందుకు తన జాగ్రత్తలో తానొచ్చింది అప్సర..ఇప్పుడు అదే వర్మకి తన మూవికి కంటెంట్ గా మారింది.