బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (16:03 IST)

పూరీ ''రత్న భండార్'' మారు తాళాలు దొరికాయోచ్..

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది.

ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ రంగులో వున్న ఓ సీల్డ్ కవర్లో డూప్లికేట్ కీస్ బయటపడ్డాయి. ఈ మేరకు పూరీ ఆలయంలో వున్న వెల కట్టలేని ఖజానా గదులకు సంబంధించిన తాళాలు దొరికాయని.. కలెక్టర్ అరవింద్ అగర్వాల్ ప్రకటించారు.
 
తాళాలు తిరిగి లభించడం నిజంగా దేవుడి అద్భుతమేనన్నారు. తాళాల కోసం వెతుకుతూ వుంటే ''రత్న భండార్''కు సంబంధించిన మారు తాళాలు లభించాయని అగర్వాల్ మీడియాతో తెలిపారు. ఎంత వెతికినా తాళాలు కనిపించలేదు. దేవుడిపైనే భారం వేసి తాళాలు వెతకడం మొదలెట్టాం అంతే.. తాళం చెవులు కనిపించాయని.. అరవింద్ చెప్పుకొచ్చారు.