బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (07:42 IST)

అంధుల కోసం ఆర్బీఐ కొత్త యాప్‌

గుడ్డి వారి కోసం ఆర్బీఐ కొత్త యాప్‌ను రూపొందించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ మ‌ని(ఎంఏఎన్ఐ) యాప్‌ను ఆవిష్క‌రించారు.

మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ యాప్ ద్వారా.. అంధులు కరెన్సీ నోట్ల‌ను గుర్తించ‌డం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మ‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

భారతీయ క‌రెన్సీ నోట్ల‌పై అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌ని, అంధులు కూడా నోట్ల‌ను గుర్తించే విధంగా యాప్‌ను రూపొందించామ‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.