గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

అంధ విద్యార్థినిపై 4 నెలలుగా..గుజరాత్‌లో దారుణం

గుజరాత్‌లోని అంబాజీ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాటన్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన అంధ విద్యార్థిని అంబాజీ ప్రాంతంలో ఓ ప్రేవేటు స్కూల్‌లో సంగీతం నేర్చుకుంటుంది.

అయితే దీపావళి ఇంటికి వచ్చిన విద్యార్థిని తిరగి స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో దారుణం బయటపెట్టింది.

అదే స్కూల్ పని చేస్తున్న జయంతీ ఠాకూర్(30), చమన్ ఠాకూర్(62) అనే ఇద్దరు అంధ టీచర్లు గత నాలుగు నెలలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా టీచర్లు ఇద్దరూ పరారీలో ఉన్నారు.